నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నాయినేనిపల్లి మైసమ్మ దేవత జాతరలో ఆదివారం ఇద్దరు మహిళా దొంగలను ఆలయ సిబ్బంది పట్టుకున్నారు. మహబూబ్ నగర్ కు చెందిన ఈ మహిళలు, జాతరలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని, చిన్న పిల్లల కాళ్లకు ఉన్న వెండి కడియాలను దొంగిలించారు. ముగ్గురు పిల్లల కడియాలను దొంగిలిస్తుండగా ఆలయ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి మూడు జతల వెండి కడియాలు, కొంత నగదును స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.