వనపర్తి జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి మంత్రి సొంతభూమి అప్పగింత

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత భూమిని ప్రభుత్వానికి అప్పగించి క్రీడాకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. శుక్రవారం, వీపనగండ్లలోని 532/ఆ సర్వే నంబర్లో తన పేరుపై ఉన్న రూ. కోటిన్నర విలువ చేసే 4 ఎకరాల భూమిని మినీ స్టేడియం నిర్మాణానికి కేటాయించారు. కోడేరు తహశీల్దార్ ఆఫీస్ లో డిజిటల్ సంతకాలు చేసి భూమి బదిలీ ప్రక్రియను పూర్తి చేసి వనపర్తి జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించారు.

సంబంధిత పోస్ట్