కల్వకుర్తి నియోజకవర్గంలో ఈనెల 11న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మంత్రులు హాజరవుతున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గంలోని మాడుగులలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల శంకుస్థాపనకు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరవుతున్నట్లు తెలిపారు.