ఆదివారం నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం వ్యక్తిపై దాడి కాదని, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై గవర్నర్ వెంటనే కేంద్ర హోం మంత్రి, ప్రధానమంత్రికి నివేదిక పంపాలని ఆయన డిమాండ్ చేశారు.