నాగర్ కర్నూల్: ఘాట్ రోడ్డుపై ప్రమాదం

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వడ్వర్లపల్లి గ్రామ సమీపంలో బుధవారం హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. శ్రీశైలం దర్శనం చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్న ఆమనగల్ గ్రామానికి చెందిన రమేష్, ఆయన కుటుంబ సభ్యులు ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన అటవీ శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్