నాగర్ కర్నూల్ జిల్లాలో డీసీసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో మంగళవారం, ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచే ఎదిగి, ఇప్పుడు అదే పార్టీని విమర్శించడం సరికాదని, రాజకీయ లబ్ధి కోసం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తగదని ఎంపీ మల్లు రవి అన్నారు.