నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రారంభించారు. 0-5 ఏళ్ల వయస్సు గల 1,00,624 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 631 కేంద్రాలు, 1,17,500 వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేశారు. ఒక్క చిన్నారి కూడా మిగలకుండా వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.