నాగర్ కర్నూల్: ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈనెల 2, 3 తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో, వరి ధాన్యం, పత్తి తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కోతకోసి కల్లాలలో ఉన్న వరి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్