మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఈనెల 13 వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోశ్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సోమవారం ఫిర్యాదుల కోసం కలెక్టర్ కార్యాలయానికి ప్రజలు రావద్దని సూచించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుంది.