సీజనల్ వ్యాధుల బారిన పడకుండా విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని, హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గురువారం పెద్దముద్దునూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డా. సృజన అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తరంగిణి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించి విద్యార్థులకు మందులను పంపిణీ చేశారు. ఎంఈఓ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.