నాగర్ కర్నూల్ జిల్లాలో నేరాలు పెరిగిపోతున్నాయి. కుమ్మెర గ్రామంలో ఘటన మరువకముందే, బిజినేపల్లి, గౌరారం శివారులో కొల్లాపూర్ కు చెందిన జగన్ హత్యకు గురయ్యాడు. ఆదివారం కేజీబీవీ విద్యార్థిని ప్రసవించి బిడ్డను డస్ట్ బిన్ లో పడేసిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. తాజాగా, కొల్లాపూర్ కు చెందిన గర్భిణి మౌనిక భర్త వేధింపుల వల్లే మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వరుస ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.