నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం బుద్ధ సముద్రంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, గ్రామీణ మహిళలు సంఘాల ద్వారా స్వావలంబన సాధిస్తూ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నారని అన్నారు. మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్న ఎమ్మెల్యే, మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.