నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం సల్కర్‌పేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాము కాటుకు గురై 10 ఏళ్ల బాలుడు చరణ్ మృతి చెందాడు. గ్రామానికి చెందిన బంగారయ్య, అంజనమ్మ దంపతుల ఏకైక కుమారుడు చరణ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండగా అర్ధరాత్రి కట్లపాము కాటు వేసింది. బాలుడి వద్ద పాము కనిపించడంతో తల్లిదండ్రులు వెంటనే నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.