నాగర్‌కర్నూల్: భార్యను హత్య చేసిన నిందితుడికి జీవితఖైదు

బిజినేపల్లిలో భార్యను కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితుడైన ఆలూరు గ్రామానికి చెందిన అబ్దుల్ నబీకి నాగర్ కర్నూల్ జిల్లా జడ్జి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2013లో వివాహం చేసుకున్న అబ్దుల్ నబీ, అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులకు గురిచేయడంతో భార్య జహీదాబేగం పుట్టినిల్లైన బిజినేపల్లిలో ఉంటోంది. కొన్ని రోజుల తర్వాత బిజినేపల్లికి వచ్చిన నిందితుడు, భార్యను నమ్మించి, ఆమెతో పాటే నివాసమున్నాడు. 15 రోజుల తర్వాత, భార్య పిల్లలు నిద్రిస్తున్న సమయంలో కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంతో గురువారం నిందితుడికి జీవితఖైదు విధించారు.

సంబంధిత పోస్ట్