నాగర్ కర్నూల్: విద్యార్థులు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ

నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే 130 మంది విద్యార్థులకు ఎంపీ డాక్టర్ మల్లు రవి, జిందాల్ స్టీల్ పవర్ సంస్థ సౌజన్యంతో సైకిళ్లను పంపిణీ చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రామీణ విద్యార్థులు విద్యను కొనసాగించడంలో రవాణా సౌకర్యం ఒక ప్రధాన సమస్య అని ఎంపీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్