నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం వ్యవసాయ కళాశాల గేట్ సమీపంలో రాత్రి 7:45 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెలుగొండ గ్రామానికి చెందిన ఎరుకలి రాముడు (38) అక్కడికక్కడే మృతి చెందాడు. నాగర్ కర్నూల్ నుంచి వెలుగొండకు బైక్ పై వెళ్తుండగా, రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని గమనించక ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు ట్రాలీని అక్కడే వదిలి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.