నాగర్ కర్నూల్: మొక్కజొన్న నష్టంపై కలెక్టర్ కు వినతి

నాగర్ కర్నూల్ జిల్లాలో అకాల వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతింది. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో కురిసిన వర్షాల వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, నాగం శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో, బుధవారం వారు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ యార్డును పరిశీలించాలని కలెక్టర్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్