ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సృజన విశిష్ట పురస్కారం అందుకున్నారు. మంగళవారం ఆమె అందిస్తున్న వైద్య సేవలను గుర్తిస్తూ, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేశ్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తోటి సిబ్బంది, స్థానికులు ఆమెకు అభినందనలు తెలిపారు.