నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకోల్‌లో కాంగ్రెస్ నేత కర్నాటి దామోదర్ గౌడ్ హత్యకు గురయ్యారు. రెండు రోజులుగా కనిపించని ఆయన శవమై సింగోటం రిజర్వాయర్‌లో తేలాడు. దామోదర్ కల్వకోల్ గ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. శుక్రవారం రాత్రి ఆ మహిళతో సన్నిహితంగా ఉండగా.. ఆ మహిళ భర్త, కొడుకు గమనించారు. ఆగ్రహం పట్టలేక దాడి చేసి దామోదర్‌ను కొట్టి చంపారు. ఆ తర్వాత శవాన్ని సంచిలో మూటకట్టి ఎంజీకేఎల్ కెనాల్‌లో పడేశారు.