నాగర్ కర్నూల్: రైతులు అపోహలు నమ్మవద్దు: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ శుక్రవారం మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని, తడిసిన ప్రతి గింజను కూడా ప్రభుత్వ మద్దతు ధర (MSP) ప్రకారం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ విషయంలో మీడియా సహకారం కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్