నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగులలో ఉన్న బీసీ బాలుర హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. చాలా కాలం నుంచి స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. వర్షం పడితే నీరు కారుతోంది. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. కిటికీలకు తలుపులు సరిగా లేవు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లు లేక బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని విద్యార్థులు వాపోయారు.