నాగర్ కర్నూల్: వాగులో ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి

శనివారం నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన శంకర్ జి (45) చిలుకల వాగులో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఇటీవల కురిసిన మొంథా తుఫాను కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శంకర్ జి తన స్వగ్రామం నుండి మామిళ్ళపల్లికి వెళ్లే క్రమంలో వాగు దాటుతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఆయనకు ఈత రాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు మృతదేహాన్ని వాగులోంచి బయటకు తీశారు. మృతుడికి భార్య కవిత, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్