నాగర్ కర్నూల్: నాగనూల్ చెరువులో వ్యక్తి గల్లంతు

బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూల్ చెరువు అలుగులో అంబటిపల్లికి చెందిన కరుణాకర్ గల్లంతయ్యాడు. కరుణాకర్, ముష్టిపల్లికి చెందిన శ్రీనివాసులు అలుగు మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. శ్రీనివాసులు చెట్లను పట్టుకొని సురక్షితంగా బయటపడగా, కరుణాకర్ ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్