బుధవారం, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు 465 కోట్ల ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేయాలని, ఐసిఎఆర్ నుండి పెండింగ్లో ఉన్న యుజిసి బకాయిలను విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. మంత్రి నిర్మల సీతారామన్ సానుకూలంగా స్పందిస్తారని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.