నాగర్ కర్నూల్: రిటైర్డ్ హెచ్ఎం రఫీయుద్దీన్ మృతి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, పీఆర్టీయూ సీనియర్ నాయకులు సయ్యద్ రఫీయుద్దీన్ హైదరాబాద్‌లో గుండె ఆపరేషన్ అనంతరం చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆయన ఉపాధ్యాయ సంఘ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం మదర్సా ఇస్లామీయ ఫజల్ ఉల్ ఉలూం పాఠశాల ప్రధాన కార్యదర్శిగా, వర్ఫ్ బోర్డు కార్యదర్శిగా సేవలందించారు. ఆయన మృతిపై విద్యావేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్