నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తో కలిసి ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో స్వీయ గణన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి కుటుంబం https://se.census.go.in వెబ్ సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.