నాగర్ కర్నూల్: దేశ సంపదను కార్పొరేట్లకే దోచిపెడుతున్నారు:

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, 11 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, కాంగ్రెస్ హయాంలోనే సంక్షేమం సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్