నాగర్‌కర్నూల్: బైక్‌ను ఢీకొన్న టిప్పర్.. మహిళ స్పాట్ డెడ్

తెలకపల్లి మండల పరిధిలోని గౌరెడ్డిపల్లి వెళ్లే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిషియన్ పని ముగించుకొని తెలకపల్లి వెళ్తున్న ముదిరాజు వెంకటమ్మ (35) అనే మహిళ, లిఫ్ట్ అడిగి బైక్‌పై వస్తుండగా, టిప్పర్ బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సంబంధిత పోస్ట్