పెద్ద కొత్తపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో మండుతున్న ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బతో మేకల కాపరి ఆలేటి గోపాల్ (49) బుధవారం రాత్రి నిద్రలోనే మృతి చెందారు. మేకలను మేపుతూ వ్యవసాయ పొలాల్లో తిరగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. పేద కుటుంబానికి చెందిన గోపాల్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.