నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామ సమీపంలోని చెరువులో గురువారం దగిండ్ల లక్ష్మమ్మ (48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి పంచనామా నిర్వహించారు. మృతురాలికి భర్తతో పాటు నలుగురు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.