పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వాదనలు పచ్చి అబద్ధాలని మంగళవారం ధ్వజమెత్తారు. కనీస పనులు చేపట్టకుండా, క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లోని నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పంప్ హౌస్, ప్యాకేజీ -3, ఏదుల పంప్ హౌస్, రిజర్వాయర్, కుమ్మెర వద్ద జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.