కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబు, రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.