రామగిరిలో సీతారామచంద్రుల కళ్యాణం

కల్వకుర్తి మండలంలోని రామగిరిలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం శనివారంనాడు కన్నుల పండువగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. రఘుపతి పేట, రామగిరి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, సీతమ్మ, రామచంద్రుల తరఫున పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. పురోహితులు శాస్త్రోక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్