వెల్దండ: బాలుడు కిడ్నాప్ కలకలం

వెల్దండ మండలంలో బుధవారం బాలుడు కిడ్నాప్‌కి గురైన ఘటన కలకలం రేపింది. చెదురుపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ నరేందర్ దంపతుల ఇద్దరు కొడుకులు తాత బయటికి వెళ్తుండడంతో వెంట వెళ్లారు. కానీ కొద్దిసేపటికి ఒక బాలుడు మాత్రమే ఇంటికి తిరిగి వచ్చాడు. మరో బాలుడు మాత్రం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, బంధువులు కలిసి గాలింపు చేపట్టారు.

సంబంధిత పోస్ట్