విజయ్ దేవరకొండ, రష్మిక నేడు తుమ్మెనపేట గ్రామానికి రాక

ఇటీవల వివాహబంధంతో ఒకటైన ప్రముఖ సినీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెనపేట గ్రామానికి వస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. తొలిసారిగా స్వగ్రామానికి వస్తున్న ఈ దంపతుల కార్యక్రమానికి సుమారు 5 వేల మంది హాజరవుతారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫామ్‌హౌస్‌ను విద్యుద్దీపాలతో అలంకరించారు.

సంబంధిత పోస్ట్