నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం కుర్మిద్ద సమీపంలో కేఎస్ఐ కాల్వకు సంబంధించి పనులకు మట్టి, రాళ్లు ఎలాంటి అనుమతి లేకుండా తరలిస్తుండగా సోమవారం గ్రామస్థులు అడ్డుకున్నారు. పలు టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా మట్టీ, రాళ్లను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.