నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కుటుంబ కలహాలతో మాధవి (33) అనే గృహిణి సోమవారం అర్థరాత్రి ఇంట్లోనే చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు సాక్షులు తెలిపారు. భర్త గౌతమ్ తెల్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అదనపు కట్నం, కుటుంబ కలహాలు లేదా అక్రమ సంబంధం వంటి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మాధవ రెడ్డి తెలిపారు.