పాము కాటు మహిళ రైతు మృతి

వెల్దండ మండలం బర్కత్పల్లి గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటు వేయడంతో వంగూరి మణెమ్మ (49) అనే మహిళా రైతు దుర్మరణం పాలైంది. శుక్రవారం సాయంత్రం పత్తి తీస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను కుటుంబ సభ్యులు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్

✕
✕