ఆదర్శ ఉపాధ్యాయుడు శేషాద్రికి ఘన నివాళి

నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన టీపీటీఎఫ్ సీనియర్ నాయకులు, గణిత ఉపాధ్యాయుడు దివంగత కామ్రేడ్ శేషాద్రిని ఉపాధ్యాయ హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఆదర్శ వ్యక్తిగా నాయకులు కొనియాడారు. ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. టీపీటీఎఫ్ జెండాతో ఘనంగా శనివారం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నారాయణమ్మ, ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు ఆలేనుర్ రామకృష్ణ, నారాయణపేట్ జిల్లా అధ్యక్షులు దేవేందర్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహమూద్, నవీన్, టీపీటీఎఫ్ నాయకులు ఉదయ్, కార్యకర్తలు, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి. రాము, కాశినాథ్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్