నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 251ని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎస్.ఐ.ఆర్ ఫారాలను నింపేటప్పుడు తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలని, కొత్త ఫోటోలతో ఓటరు వివరాలను BLO యాప్‌లో సకాలంలో అప్‌లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ దండు శ్రీశైలం, బి.ఎల్.ఓ కవిత, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.