నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామంలోని గజ్జలమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని అఖిలపక్ష నాయకులు బుధవారం మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందించారు. ఆలయాన్ని ఎండోమెంట్ శాఖ పరిధిలోకి తీసుకురావడంతో పాటు కామన్ గుడ్ ఫండ్ (CGF) నుంచి అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని, దీపం, నైవేద్యాల నిర్వహణకు స్థిర నిధులు సమకూర్చి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.