అక్రమంగా నడుస్తున్న ప్రవేట్ విద్యాసంస్థ పై ఫిర్యాదు..

నారాయణపేట జిల్లాలో గత ఆరు సంవత్సరాలుగా నారాయణపేట పట్టణంలో సత్యనారాయణ గుడి ఎదురుగా ఉన్న ఐఐటి రవితేజ నెట్ అకాడమీ అనే విద్యా సంస్థ ఎలాంటి గుర్తింపు బోర్డులు లేకుండా అక్రమంగా కొనసాగుతోందని, బస్సులు కూడా నడుపుతోందని సోషల్ వర్కర్ సీతారాం రెడ్డి ఆరోపించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్, డీఈఓ, ఎంఈఓలకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్