లింగంపల్లి ఎల్లమ్మ జాతరలో భక్తజన సందోహం, మొక్కులు చెల్లించుకున్న భక్తులు

నారాయణపేట జిల్లా లింగంపల్లి గ్రామంలో సర్పంచి భాగ్య జగన్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఎల్లమ్మ జాతర రెండో మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఈ జాతరకు నారాయణపేట, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ జాతర ప్రతి నెలా నెలవారీగా మంగళవారం జరుగుతుంది. పిల్లల కోసం మిఠాయి దుకాణాలు, ఆట వస్తువులతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్