రైతు భరోసా సకాలంలో ఇవ్వాలి: ఏఐయుకేఎస్

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న విత్తనాల సమస్యలు, రైతు భరోసా సకాలంలో అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) నారాయణపేట మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నారాయణపేట తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు బి. నారాయణ, ప్రధాన కార్యదర్శి ఏ. బాలకృష్ణ మాట్లాడుతూ, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్