రైతుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐయుకేఎస్

నారాయణపేట జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనుకు వినతి పత్రం అందించారు. పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలని, నకిలీ విత్తనాలు, పురుగు మందులను అరికట్టాలని, యూరియా యాప్ ను రద్దు చేయాలని, మక్తల్ నియోజకవర్గంలో జింకల బారి నుండి పంటలను కాపాడాలని ఏఐయుకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి, సహాయ కార్యదర్శి కొండ నరసింహులు డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్