ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలి: బీసీ జాగృతి సేన

బీసీ జాగృతి సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్, జిల్లా అధ్యక్షులు ఎడ్ల కుర్మయ్యలు నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం మాట్లాడుతూ, ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు 30న కళాశాలలు బంద్ కు బీసీ జాగృతి సేన పిలుపునిచ్చిందని తెలిపారు. 8వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టుల పై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తులపై ప్రభుత్వానికి లేదని విమర్శించారు. 30న జరిగే బంద్ కు అన్ని కళాశాలలు స్వతంత్రంగా మద్దతు తెలపాలని కోరారు.

సంబంధిత పోస్ట్