తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవితను తెలంగాణ ఉద్యమకారుడు, గున్ ముక్ల మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాస్ నారాయణపేట జిల్లాలో కలిశారు. గున్ ముక్ల మాల గుట్టలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వల్ల గ్రామాలకి జరిగే నష్టాన్ని ఆయన కవిత దృష్టికి తీసుకెళ్లారు. మైనింగ్ వల్ల కడపరాయ దేవాలయం, చెరువు, నర్సరీ, విద్యుత్ సబ్ స్టేషన్, రైతు వేదిక, స్మశాన వాటిక, ప్రభుత్వ పాఠశాల, గ్రామాలను కలిపే దంబార్ రోడ్డు, గుట్టకు అనుకోని ఉన్న ఇళ్లకు ఇబ్బంది కలుగుతుందని గౌని శ్రీనివాస్ వివరించారు. ఈ సందర్భంగా నారాయణ పేట్ జిల్లా TRS అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ కూడా ఉన్నారు.