లేబర్ కోడ్స్ రద్దు చేయాలిఅని టీయూసిఐ నాయకుల నిరసన

తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయడాన్ని నిరసిస్తూ, టీయూసిఐ నాయకులు నారాయణపేట బస్టాండ్ సమీపంలో లేబర్ కోడ్స్ ప్రతులను సోమవారం దగ్ధం చేశారు. జిల్లా కార్యదర్శి బోయిన్ పల్లి రాము మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ ను ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలుకు పూనుకుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కోడ్స్ ను అమలు చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఈ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్