నారాయణపేట జిల్లాలో శనివారం, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే లక్ష్మీపతి గౌడ్ అప్పాక్ పల్లి లీగల్ ఎయిడ్ క్లినిక్ ను సందర్శించారు. క్లినిక్ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆయన ఆరా తీశారు. రికార్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించారు. గ్రామ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ విజయ్ లతో మాట్లాడుతూ, లీగల్ ఎయిడ్ క్లినిక్ ల ఆవశ్యకతను, ప్రజలకు వాటిని చేరువ చేయడంలో వారి పాత్రను వివరించారు. ప్రజల న్యాయ సమస్యలకు ఇక్కడ పరిష్కారాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ సిబ్బంది పీఎల్వి హాజమ్మ, న్యాయవాది హనుమేష్ పాల్గొన్నారు.