రంగారెడ్డి: న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యువ న్యాయవాది స్వప్న హత్య నేపథ్యంలో నారాయణపేట జిల్లా కోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి గురువారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షులు దామోదర్ గౌడ్, సెక్రటరీ చెన్నా రెడ్డి, కోశాధికారి కే కృష్ణ గౌడ్, ఇతర న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డిఫెన్స్ కౌన్సిల్ పాల్గొన్నారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, న్యాయవాదుల రక్షణ చట్టం తేవాల్సిన ఆవశ్యకత ఉందని దామోదర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వాలు స్పందించి త్వరగా ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్